ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో మరో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు

ప్రస్తుతం పెరిగిన ఉష్ణోగ్రతలతో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి.. ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నట్లు హైదరాబాద్​ వాతావారణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే నగరవ్యాప్తంగా మరో రెండ్రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు సూచించారు.

heavy rains for another three days in the telangana state
తెలంగాణలో మరో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు...!

By

Published : Oct 18, 2020, 9:49 AM IST

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు.. ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం రంగారెడ్డి, జీహెచ్​ఎంసీ పరిధిలో కురుస్తోన్న వర్షాలు.. చివరి రెండు రోజుల్లో దక్షిణ తెలంగాణ జిల్లాలకు విస్తరిస్తాయని పేర్కొంది.

ప్రస్తుతం పెరిగిన ఉష్ణోగ్రతలతో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి.. ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో రెండు రోజుల పాటు హైదరాబాద్​ నగరవ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు సూచించారు. బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశముందని.. ఇది ఈ నెల 20 నాటికి తీవ్రమవుతుందని వెల్లడించారు.

శనివారం రాత్రి పదిగంటల వరకు జంటనగరాల్లోని ప్రాంతాలైన ఘట్ కేసర్​లో అత్యధికంగా 19.7 సెం.మీ, సరూర్​నగర్​లో 17, మేడిపల్లిలో 16.9, ఎల్బీనగర్ 16.7, ఉప్పల్, బండ్లగూడ, మొయినాబాద్, సైదాబాద్, అబ్దుల్లాపూర్​మెట్​లో 15 సెం.మీల పైచిలుకు వర్షపాతం నమోదయింది.

ఇదీ చదవండి:

వరదెత్తిన కృష్ణమ్మ.. 2009 తర్వాత శ్రీశైలానికి మళ్లీ భారీ వరద

ABOUT THE AUTHOR

...view details