మే 31 నాటికి కేరళలో నైరుతి రుతుపవనాలు ఆగమనానికి అంతా అనుకూలంగా ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి కొనసాగుతూనే ఉందని విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
ఈ ప్రభావంతో వచ్చే మూడు రోజుల వరకు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పాటు, ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు.