ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వాతావరణం: ఇవాళ, రేపు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు - బంగాళాఖాతంలో అల్పపీడనం వార్తలు

రాష్ట్రంలో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ఉభయగోదావరి జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

andhrapradesh
andhrapradesh

By

Published : Sep 13, 2020, 4:54 PM IST

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ, రేపు ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన ఉండగా...ఉభయగోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఇవాళ కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పాటు రేపు దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిస్తాయని తెలిపింది. రేపు కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ, రాయలసీమలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details