ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్​లో జోరు వర్షం.. రోడ్లన్నీ జలమయం

Hyderabad Rains Today: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి. ఈరోజు పలుచోట్ల కురిసిన వర్షానికి నగరవాసులు తడిసిమద్దయ్యారు. రహదారులపైకి నీరు రావడంతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు.

hyd rains
hyd rains

By

Published : Oct 5, 2022, 7:53 PM IST

Updated : Oct 5, 2022, 9:37 PM IST

Hyderabad Rains Today: హైదరాబాద్​లో వరుణుడు మరోసారి ప్రతాపం చూపించాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది. వానహోరుతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. రోడ్లు జలమయమయ్యాయి. సికింద్రాబాద్, దోమలగూడ, కాప్రా, ఏఎస్‌రావు నగర్‌, గౌతమ్‌నగర్‌, కేపీహెచ్‌బీ, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, చిక్కడపల్లి​ ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది.

బాగ్‌లింగంపల్లి, బోలక్‌పూర్‌, కవాడిగూడ, జవహర్​నగర్, గాంధీనగర్, రామ్‌నగర్, చంపాపేట్, ఐఎస్​సదన్, సంతోష్​నగర్, సైదాబాద్‌, మలక్‌పేట్, చాదర్‌ఘాట్‌, సరూర్‌నగర్‌ ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. చాంద్రాయణగుట్ట, బార్కాస్, ఫలక్‌నుమా, బహదూర్‌పురా, చార్మినార్‌, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, తిరుమలగిరి, బేగంపేట్, ఆల్వాల్, ప్యాట్నీ, చిలకలగూడ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

నారాయణగూడ, హిమాయత్‌నగర్‌, పంజాగుట్ట, మల్కాజ్‌గిరి, ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి వరదనీరు రహదారుల పైకి రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. హనుమకొండ, వరంగల్, కాజీపేటలోని పలు ప్రాంతాల్లో జోరు వాన కురిసింది.

ఖమ్మం గ్రామీణ మండలం, మణుగూరు, కూసుమంచి, కారేపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో కూసుమంచి-నేలకొండపల్లి రహదారిపై వర్షపు నీరు నిలిచిపోయింది. కూసుమంచి మండలంలోని లింగారంతండా శివారు గన్యాతండాలో పిడుగుపాటుకు గురై మూడు పశువులు మృతి చెందాయి. రాజేశ్వరపురం గ్రామంలో వరద నీరు ఇళ్లలోకి చేరింది.

హైదరాబాద్​లో జోరు వర్షం.. రోడ్లన్నీ జలమయం

ఇవీ చదవండి:

Last Updated : Oct 5, 2022, 9:37 PM IST

ABOUT THE AUTHOR

...view details