Hyderabad Rains Today: హైదరాబాద్ నగరంలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. మరోసారి వరణుడు నగరవాసులన్ని వణికించేస్తున్నాడు. నగరంలోని మెహిదీపట్నం, గోషామహల్, మంగళ్‌హాట్, ఆసిఫ్‌నగర్, జియాగూడ పంజాగుట్ట, అమీర్‌పేట్, ఖైరతాబాద్, మెహిదీపట్నం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బహదూర్‌పురా, ఫలక్‌నుమా, చంద్రాయణగుట్ట, సికింద్రాబాద్, ప్యాట్నీసెంటర్, బేగంపేట, అల్వాల్, చిలకలగూడ, తిరుమలగిరి, బోయిన్‌పల్లి, మారేడుపల్లిలో ప్రాంతాల్లో వర్షం పడుతోంది.
హైదరాబాద్‌లోని ఓయూ క్యాంపస్, లాలాగూడ, హబ్సీగూడ, తార్నాకా, నాచారం, మల్లాపూర్ ప్రాంతాల్లో వర్షం పడింది. కూకట్‌పల్లి, హైదర్‌నగర్, నిజాంపేట్, మూసాపేట్, నాచారం, కాప్, ప్రగతినగర్, ఆల్విన్‌కాలనీ, వివేకానందనగర్‌లోనూ వరుణుడు దంచికొట్టాడు. నగరంలో కురుస్తున్న భారీ వర్షానికి మూసి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దాంతో మళ్లీ ముసాారాంబాగ్ (చాందిని బ్రిడ్జి) వంతెన నీట మునిగింది. వంతెన నీట మునగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భారీగా వరద నీరు రోడ్లపై నిల్వడంతో చాదర్‌ఘాట్ చిన్న వంతెన నుంచి నల్లగొండ ఎక్స్ రోడ్డు వరకు భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
Heavy Rain in Hyderabad: సాయంత్రం పూట పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాల నుంచి వెళ్తున్న వారు ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల వాన నీరు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భారీ వర్షానికి నగరంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. పలుప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పనుల మీద బయటకు వెళ్తున్న వాహనదారులు వరద నీటితో ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో కొన్ని చోట్ల వానకు నాలాలు పొంగి ఆ నీరంతా రోడ్లపైకి చేరుతోంది. మురుగు కంపు కొడుతున్న నీటివల్ల స్థానికులు అవస్థలు పడుతున్నారు.