Heavy Rain in Hyderabad :హైదరాబాద్‌లో మళ్లీ వర్షం దంచి కొడుతోంది. మధ్నాహ్నాం వరకు ఎండ కొట్టగా.. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చినుకులతో మొదలైన భారీగా వర్షం మారింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మూసీనది వరద ఉద్ధృతి తగ్గడంతో కాస్త ఊపిరి పీల్చుకున్న నగర వాసులు.. మళ్లీ వర్షం కురుస్తుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. వివిధ పనులపై బయటకు వెళ్లిన నగరవాసులు వర్షానికి తడిసి ముద్దయ్యారు. రోడ్లపై నీళ్లు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Floods in Hyderabad: మియాపూర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్, ప్రగతి నగర్, బాచుపల్లి, జీడిమెట్ల, బాలానగర్, అపురూపకాలనీ, కుత్బుల్లాపూర్, గాజులరామారం, సూరారం, అమీర్‌పేట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, అసెంబ్లీ, బషీర్‌బాగ్, బేగంబజార్, కోఠి, సుల్తాన్‌బజార్, అబిడ్స్, నాంపల్లి, హిమాయత్‌నగర్, నారాయణగూడ, లిబర్టీ, ముషీరాబాద్, చిక్కడపల్లి, అచ్యుత్‌రెడ్డి మార్గ్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, కవాడిగూడ, బోలక్ పూర్, గాంధీనగర్, రాంనగర్, దోమల గూడ, ఉప్పల్, రామంతాపూర్, దిల్‌సుఖ్ నగర్, కొత్తపేట, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం కురిసింది. రహదారులపైకి నీరు చేరడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.