తెలంగాణలోని హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో గురువారం అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. సాయంత్రం నుంచే వాతావరణంలో మార్పు రాగా... చలి కూడా పెరిగింది. సుమారు 11 గంటల ప్రాంతంలో వర్షం మొదలైంది.
హైదరాబాద్‌లో అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో వర్షం - ఉరుములు మెరుపులతో కూడిన వర్షం
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి సమయంలో వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవగా... పాతబస్తీలో ఓ మోస్తరు వాన పడింది.
![హైదరాబాద్‌లో అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో వర్షం heavy rain in Hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10684887-94-10684887-1613676969016.jpg)
తెలంగాణ: హైదరాబాద్‌లో అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని ఎల్బీనగర్, కొత్తపేట ప్రాంతంలో ఉరుములు మెరుపులతో వాన పడింది. బహదూర్ పురా, పురణాపూల్, దూద్‌బౌలి, లంగర్‌హౌస్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.