గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి భాగ్యనగరం తడిసి ముద్దయింది. బేగంబజార్, ఎంజే మార్కెట్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, బషీర్ బాగ్, నారాయణగూడ, హిమాయత్‌నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నాంపల్లి, ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట, పంజాగుట్ట, బేగంపేట, కూకట్పల్లి, ఎల్బీనగర్, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లో వర్షం కురిసింది.
హైదరాబాద్‌లో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం
ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
భారీ వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మల్కాజిగిరి, నేరెడ్మెట్, కుషాయిగూడ, చర్లపల్లి, నాగారం, దమ్మాయిగూడాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి రోడ్లపై నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది.
తెలంగాణలో మరో 3 రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఆదివారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. రేపు, ఎల్లుండి అనేకచోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది.