ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కుంభవృష్టిలా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ వాసులు అల్లాడుతున్నారు. నగరానికి మరోసారి భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మరోగంటలో వర్షం పడుతుందని హెచ్చరించింది. 6-8 గంటల పాటు వర్షం కురిసే అవకాశముందని వెల్లడించింది. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. సహాయం కోసం నం. 040- 2955 5500 సంప్రదించాలని తెలిపింది.
TS RAIN ALLERT: 6-8 గంటల పాటు ఇళ్లల్లోనే ఉండండి: జీహెచ్‌ఎంసీ - అమరావతి వార్తలు
తెలంగాణలో రానున్న 6-8 గంటల్లో హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తుందని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావద్దని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు.
HEAVY RAIN