ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా గంజాయి, శంషాబాద్ విమానాశ్రయం కేంద్రంగా వివిధ రకాల మత్తుమందులు.. హైదరాబాద్కు చేరుతున్నాయి. వీటిని నిరోధించే బాధ్యత ఎక్సైజ్ శాఖదంటూ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడం లేదు. ఎక్కడినుంచైనా సమాచారం అందితే ప్రత్యేక పోలీసు విభాగాలు దాడులు చేయడం తప్పా.. పూర్తిస్థాయి నిఘా ఉండటం లేదు. ఇది వ్యాపారులకు వరంగా మారింది. విశాఖ నుంచి తెచ్చిన దీన్ని భారీ రేట్లకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఎక్సైజ్ శాఖలో పూర్తిస్థాయిలో సిబ్బంది లేకపోవడంతో తూతూమంత్రంగా దాడులు చేసి వదిలేస్తున్నారు. కళాశాలల దగ్గర కొకైన్ లాంటి అనేక రకాల మత్తుమందుల విక్రయాలు జరుగుతుంటే పోలీసులు దృష్టిసారించడం లేదు. ఎక్కడైనా దొరికినా రెండుమూడు రోజులు హడావుడి చేస్తూ తర్వాత మర్చిపోతున్నారు. ఆన్లైన్ ద్వారా కూడా వీటిని పొందుతున్నారు. దీనివల్లే అనేకమంది నేరాలు చేయగలుగుతున్నారని నిపుణులు చెబుతున్నారు.
సెల్ వాడకపోతే నిందితున్ని పట్టుకోలేరా!
చిన్నారి హత్యాచారం ఘటనలో నిందితుడు సెల్ఫోన్ వాడడని పోలీసులు చెబుతున్నారు. అందుకే ఘటన జరిగిన ఆరు రోజులైనా నిందితుడిని పట్టుకోలేకపోయామని చెబుతున్నారు. ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షల బహుమానంగా ఇస్తామని ప్రకటించారు. దీన్నిబట్టి చూస్తే సెల్ఫోన్ వాడకపోతే నిందితులను అరెస్టు చేయడం సాధ్యం కాదా అంటూ అనేకమంది పోలీసుల తీరును ప్రశ్నిస్తున్నారు. ఠాణాల పరిధిలో కాలనీల వారీగా పోలీసులకు సమాచారం ఇచ్చే వ్యవస్థ పటిష్ఠంగా ఉంటే ఎటువంటి నేరం చేసిన నిందితులైనా కూడా సులభంగా పట్టుకోవచ్చని నిపుణులు అంటున్నారు.
కఠిన చర్యలు తీసుకుంటాం