ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నిండు కుండలా హుస్సేన్ సాగర్‌... గరిష్ట స్థాయికి నీటిమట్టం - heavy-flood-water-into-hussain-sagar-authorities-alerted

గత కొద్దిరోజులుగా హైదరాబాద్​లో కురుస్తున్న వర్షాలతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. నీటిమట్టం పెరుగుతుండటం వల్ల స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

By

Published : Aug 16, 2020, 4:41 PM IST

గత కొన్ని రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లోని హుస్సేన్​ సాగర్​లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 513.41 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 513.64 మీటర్లకు చేరింది.

ఫలితంగా జీహెచ్ఎంసీ లేక్ అధికారులు అప్రమత్తమయ్యారు. రెండు అలుగులు, ఒక తూము ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. వచ్చిన నీటిని వచ్చినట్టే వదులుతున్నప్పటికీ.. నీటిమట్టం పెరుగుతుండటం వల్ల స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హుస్సేన్​సాగర్ క్యాచ్‌మెంట్ ఏరియా 240 చదరపు కిలో మీటర్లు ఉండగా.. ఈ ప్రాంతం మొత్తాన్ని వర్షం ముంచెత్తుతోంది.

మరోవైపు నగరంలో వర్షం తగ్గుముఖం పట్టిందని... సాగర్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. రెండు రోజుల్లో సాధారణ స్థితికి చేరుతుందని బల్దియా అధికారులు భరోసా ఇచ్చారు.

ఇదీచూడండి:

నయాగరా జలపాతంలో మువ్వన్నెల జెండా ఉప్పొంగగా!

ABOUT THE AUTHOR

...view details