SRISAILAM :భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.50 అడుగులకు చేరింది. ప్రస్తుతానికి ప్రాజెక్టు నుంచి 5 గేట్లను 10అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ద్వారా 1.39 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేసి 66,202 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం పూర్తి నీటినిల్వ 215.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటినిల్వ 212.91 టీఎంసీలుగా ఉంది. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 1.47 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది.
సోమశిల :నెల్లూరు జిల్లా సోమశిల జలాశయానికి వరద కొనసాగుతోంది. కర్నూలు, కడప జిల్లాల్లో కురిసిన వర్షాలకు 36 వేల క్యూసెక్కుల ప్రవాహం ప్రాజెక్టుకు వస్తోంది. సోమశిల నుంచి పెన్నా ద్వారా 35 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. 70 టీఎంసీల సామర్థ్యంతో సోమశిల జలాశయం నిండు కుండలా మారింది. పెన్నా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచనలు జారీ చేశారు.