ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

SRSP: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద

రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని శ్రీరాంసాగర్‌ జలాశయానికి వరద వస్తోంది. గురువారం 36వేలకు పైగా క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.. సాయంత్రానికి 61వేలకు పైగా చేరింది. వరద మరింత పోటెత్తడంతో రాత్రి 7 వరద గేట్లు ఎత్తి.. దిగువకు విడుదల చేశారు.

SRSP Project
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద

By

Published : Aug 20, 2021, 11:20 AM IST

రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని శ్రీరాంసాగర్‌ జలాశయానికి భారీ వరద పోటెత్తుతోంది. గురువారం ఉదయం 36,980 క్యూసెక్కులు ఉండగా సాయంత్రానికి 61,650కి పెరిగింది. వరద మరింత పోటెత్తడంతో గురువారం రాత్రి 9.30 గంటలకు ఏడు వరద గేట్లు ఎత్తి 21,840 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా 1090.7 అడుగులకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 88.112 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి చేపల వేటకు ఎవరూ వెళ్లొద్దని ప్రాజెక్టు ఎస్‌ఈ శ్రీనివాస్‌, ఈఈ చక్రపాణి తెలిపారు.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద.. 7 గేట్లు ఎత్తివేత

22.5 మిల్లీ మీటర్ల వర్షం

జిల్లాలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. అల్పపీడన ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. నిజామాబాద్‌ పట్టణంలో(దక్షిణ మండలం) అత్యధికంగా 57.5 మి.మీ. వర్షం పడింది. నవీపేట్‌లో 54.2, మెండోరాలో 42.0, నిజామాబాద్‌ ఉత్తరంలో 40.6, నిజామాబాద్‌ రూరల్‌లో 41.3, ధర్పల్లిలో 35.2, ఏర్గట్లలో 29.8, ధర్పల్లిలో 36.1, మాక్లూర్‌లో 29.2, చందూర్‌లో 28.8, ఎడపల్లిలో 27.8, బోధన్‌లో 22.4, నందిపేట్‌లో 19.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో సగటున 22.5 మిల్లీమీటర్లు కురిసింది. ఇప్పటివరకు 625.5 మి.మీ.కు గాను 858.6 మి.మీ. పడింది. ఈ సీజన్‌లో ప్రస్తుతానికి 21 మండలాల్లో సాధారణం కంటే ఎక్కువగా, మిగతా 8 మండలాల్లో సాధారణ వర్షం పడినట్లు గణాంకశాఖ వెల్లడించింది.

  • ఇదీ చదవండి :

krishna water: మాకు 70.. వారికి 30 నిష్పత్తిలో పంచండి.. కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు ఏపీ లేఖ

ABOUT THE AUTHOR

...view details