ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నాగార్జునసాగర్‌ 18 క్రస్టు గేట్లు ఎత్తి నీటి విడుదల

నాగార్జునసాగర్​ ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం 18 క్రస్టు గేట్లు 20 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.

heavy-flood-comming-to-nagarjunasagar-from-upper-area
నాగార్జునసాగర్‌ 18 క్రస్టు గేట్లు ఎత్తి నీటి విడుదల

By

Published : Oct 18, 2020, 10:40 AM IST

నాగార్జునసాగర్‌కు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. జలాశయం 18 క్రస్టు గేట్లు 20 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 5,38,467 క్యూసెక్కులు ఉండగా.. అవుట్‌ ఫ్లో 5,38,467 క్యూసెక్కులుగా ఉంది.

నాగార్జునసాగర్‌ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 309.35 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 589.10 అడుగులుగా ఉంది.

ఇదీ చదవండి:రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు..!

ABOUT THE AUTHOR

...view details