ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రేపటి నుంచి లాక్​డౌన్​ ఎఫెక్ట్​: తెలంగాణలో వైన్స్​ ముందు బారులు

రేపటి నుంచి తెలంగాణలో లాక్​డౌన్​ ప్రకటించడంతో మద్యం దుకాణాల వద్ద రద్దీ పెరిగింది. మందుబాబులు తమకు దగ్గర్లో ఉన్న వైన్సులకు పరుగులు తీశారు. మందుబాబులంతా ఒక్కసారిగా వైన్సుల వద్దకు చేరుకోవడంతో... రద్దీ ఎక్కువైంది. కరోనా నిబంధనలు పక్కన పెట్టి.. మందు దొరికితే చాలు అన్నట్టు మందు ప్రియులు ఎగబడిపోతున్నారు.

crowd at wine shops
crowd at wine shops

By

Published : May 11, 2021, 4:05 PM IST

రేపటి నుంచి లాక్​డౌన్​ ఎఫెక్ట్​: తెలంగాణలో వైన్స్​ ముందు బారులు

తెలంగాణలో రేపటి నుంచి పది రోజుల వరకు లాక్​డౌన్​ ప్రకటించిన నేపథ్యంలో మందుబాబులు అప్రమత్తమయ్యారు. లాక్​డౌన్​ వార్త అందుకున్న వెంటనే మందుకోసం వైన్సులకు పరుగులు తీశారు. చూస్తుండగానే మందు దుకాణాల ముందు చాంతాడంతా క్యూలైన్లు తయారయ్యాయి.

తమకు దగ్గర్లో ఉన్న వైన్సుల ముందు మందుప్రియులు బారులు తీరారు. హైదరాబాద్​ నగరంలోని అన్ని వైన్స్​ల వద్ద దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. క్రమంగా పెరుగుతున్న రద్దీ నేపథ్యంలో చాలా చోట్ల భౌతిక దూరం పాటించకుండానే క్యూలైన్లలో నిల్చున్నారు.

లక్డీకాపూల్‌, నారాయణగూడ, చైతన్యపురిలోని వైన్సుల ముందు మందుబాబులు బారులు తీరారు. సుచిత్ర, జీడిమెట్ల, గాజులరామారం, కుత్బుల్లాపూర్, సురారంలో ఒక్కసారిగా మద్యం ప్రియులు దుకాణాల వద్దకు చేరగా... రద్దీ ఎక్కువైంది. ఎలాంటి భౌతిక దూరం, మాస్క్‌లు లేకుండానే మద్యం కోసం ఎదురుచూస్తుండడం.. స్థానికుల్లో ఆందోళన పెంచుతోంది.

ఇదీ చూడండి:

గ్రామాల్లో మహమ్మారి విజృంభణ ... దిక్కుతోచని స్థితిలో పల్లె ప్రజానీకం

ABOUT THE AUTHOR

...view details