ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వేడెక్కిన దుబ్బాక ఉపఎన్నిక రాజకీయం... కొనసాగుతోన్న ఉద్రిక్తత - Dubbaka by election news

తెలంగాణ భాజపా నేత రఘునందన్​రావు బంధువుల ఇంట్లో సోదాలతో వేడెక్కిన దుబ్బాక ఉపఎన్నిక రాజకీయం మరింత కాకరేపుతోంది. సిద్దిపేట పోలీసు కమిషనర్‌ను సస్పెండ్‌ చేయాలని కరీంనగర్‌లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ దీక్షను కొనసాగిస్తున్నారు. ఓటమి భయంతోనే తెరాస కుట్రలకు తెగబడుతోందని సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు భాజపా నేతలు ప్రగతి భవన్ ను‌ ముట్టడిస్తారనే వార్తల నడుమ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.

Dubaka by-election
వేడెక్కిన దుబ్బాక ఉపఎన్నిక రాజకీయం.

By

Published : Oct 27, 2020, 3:52 PM IST

తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక ఉపఎన్నిక రాజకీయం రసవత్తరంగా మారుతోంది. భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు బంధువుల ఇంట్లో సోమవారం సోదాలతో మొదలైన రాజకీయ ఉద్రిక్తతలు.. ఇంకా కొనసాగుతున్నాయి. సిద్దిపేట పోలీస్​ కమిషనర్‌ను సస్పెండ్ చేసి కేసు నమోదు చేయాలన్న డిమాండ్‌తో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కరీంనగర్‌లో దీక్ష కొనసాగిస్తున్నారు.

'తెరాస కుట్రలు...'

సిద్దిపేటకు వెళ్తుండగా సోమవారం సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేయగా ఆయన దీక్ష చేపట్టారు. దుబ్బాకలో భాజపా గెలవబోతుందన్న సంజయ్‌... ఎన్నికలను వాయిదా వేయించేందుకు తెరాస కుట్రలు దిగుతోందని ఆరోపించారు. దీక్షకు సంఘీభావం ప్రకటించిన భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ... ఓటమి భయంతోనే తెరాస నిర్బంధ చర్యలకు దిగుతోందని ఆరోపించారు.

పోలీసుల బందోబస్తు...

భాజపా నేతలు ప్రగతిభవన్‌ ముట్టడిస్తారనే ఊహాగానాల నడుమ పోలీసులు ప్రత్యేక బందోబస్తు చర్యలు చేపట్టారు. తార్నాకలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావును పోలీసులు గృహనిర్బంధం చేశారు. కరీంనగర్‌కు వెళ్లేందుకు యత్నించిన భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ను మంగళహాట్‌ పోలీసులు గృహనిర్బంధం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు...

దుబ్బాకలో పోలీసుల వైఖరిని నిరసిస్తూ రాష్ట్రంలో పలుచోట్ల భాజపా శ్రేణులు నిరసన చేపట్టాయి. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ చౌరస్తా, మౌలాలి హౌసింగ్ బోర్డ్ వద్ద నిరసనలు చేపట్టాయి. ఖమ్మంలో నిరసన తెలుపుతున్న భాజపా కార్యకర్తల పోలీసులు అరెస్టు చేశారు.

ఇవీచూడండి:

కొత్త జిల్లాల ఏర్పాటుపై.. జనవరి 26న ప్రకటన: కోన రఘుపతి

ABOUT THE AUTHOR

...view details