ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: బిడ్డను కాపాడబోయి బాలింత మృతి - సూర్యాపేట జిల్లాలో బాలింతపై కోతుల దాడి

తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో హృదయవిదారక ఘటన జరిగింది. బాలింతపై కోతులు దాడి చేయగా.. అక్కడికక్కడే మృతిచెందింది. మహిళకు ముగ్గురు చిన్నపిల్లలు ఉండటంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

woman dead
బాలింత మృతి

By

Published : Dec 1, 2020, 11:18 PM IST

కోతుల దాడిలో బాలింత మృతి చెందిన ఘటన.. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో జరిగింది. మద్దిరాల మండలం కుక్కడం గ్రామానికి చెందిన శ్రీలత.. రెండు నెలల క్రితమే ప్రసవించింది. బిడ్డను కోతులు ఎత్తుకుపోతాయన్న భయంతో మహిళ కర్ర తీసుకోగానే.. వానరాలు ఆమెపై మూకుమ్మడిగా దాడి చేశాయి. ప్రమాదవశాత్తు ఆమె జారి కిందపడగా.. తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందింది.

బాలింత మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆ మహిళకు ముగ్గురు చిన్నపిల్లలు ఉండటంతో గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మృతురాలి భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బండి సాయిప్రశాంత్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details