రాష్ట్రంలో కొవిడ్ కేసులు, ప్రభుత్వ చర్యలపై హైకోర్టులో విచారణ జరిగింది. కొవిడ్ రోగులకు మెరుగైన వైద్యం అందట్లేదంటూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం విచారించింది. చిన్నారులపై కొవిడ్ ప్రభావం, బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ల కొరతపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. చిన్నారుల్లో కొవిడ్ ప్రభావంపై టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
High court: కేంద్రం తీరుపై హైకోర్టు అసంతృప్తి..సమగ్ర వివరాలివ్వాలని ఆదేశం - కరోనా నివారణ చర్యలపై హై కోర్టులో విచారణ
బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ల కొరతను అధిగమించే చర్యలపై సమగ్ర వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఇంజెక్షన్ల కొరతపై కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. కేంద్రం అఫిడవిట్ సరిగా సమర్పించలేదంటూ ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.
ap high court on corona cases
రాష్ట్రంలో 1,777 బ్లాక్ ఫంగస్ కేసులున్నట్లు వివరించింది. బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ల కొరతపై కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. కేంద్రం అఫిడవిట్ సరిగా సమర్పించలేదంటూ ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇంజెక్షన్ల కొరతను అధిగమించే చర్యలపై సమగ్ర వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడింది.
ఇదీ చదవండి: