ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోలవరం ఖర్చు: కేవీపీ వేసిన పిల్‌పై హైకోర్టులో విచారణ

పోలవరం ఖర్చు కేంద్రమే భరించాలని కేవీపీ వేసిన పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పూర్తి వివరాలతో అదనపు ప్రమాణపత్రం ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని గతంలోనే కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది.

Hearings in High court On KVP pil
పోలవరం ఖర్చు: కేవీపీ వేసిన పిల్‌పై హైకోర్టులో విచారణ

By

Published : Feb 25, 2020, 10:06 PM IST

పోలవరం పూర్తి ఖర్చును కేంద్రమే భరించాలని కేవీపీ రామచంద్రరావు వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ... ఇప్పటికే కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టులో పెండింగ్​లో ఉండగా హైకోర్టులో వాదనలు ఎలా జరపాలని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. తాను వేసిన పిటిషన్​కు సుప్రీంకోర్టులో పెండింగ్​లో ఉన్న పిటిషన్​కు వ్యత్యాసం ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది వివరించారు. పూర్తి వివరాలతో అదనపు ప్రమాణపత్రాన్ని సమర్పించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details