ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉపాధి హామీ పనులు: 'త్వరలో బకాయిలు చెల్లిస్తాం' - Hearings in High court on Employment Guarantee Works

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2018-19 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులకు బకాయిలు చెల్లించకపోవడాన్ని సవాలు చేస్తూ... దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది. 5 లక్షల లోపు విలువ చేసే పనులకు బకాయిలు చెల్లించే నిమిత్తం 870 కోట్ల రూపాయలు విడుదలకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ జారీచేస్తూ... ఈ నెల 22న జీవో జారీ చేశామని ప్రభుత్వ న్యాయవాది సుమన్ హైకోర్టుకు వివేదించారు.

ఏపీ హైకోర్టు
ఏపీ హైకోర్టు

By

Published : Apr 23, 2021, 10:45 PM IST

ఉపాధి హామీ పథకం కింద 2018-19 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన 5 లక్షల లోపు విలువ చేసే పనులకు బకాయిలు చెల్లించే నిమిత్తం 870 కోట్ల రూపాయలు విడుదలకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ జారీచేస్తూ... ఈ నెల 22న జీవో జారీ చేశామని ప్రభుత్వ న్యాయవాది సుమన్ హైకోర్టుకు వివేదించారు. త్వరలో బకాయిలు చెల్లిస్తామన్నారు. మొత్తం 7.27 లక్షల పనులు రూ.5 లక్షల లోపు విలువ చేసే పరిధిలోకి వస్తాయన్నారు. రూ.5 లక్షలకు పైబడిన పనుల విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని వివరించారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... విచారణను జులై 2కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2018-19 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులకు బకాయిలు చెల్లించకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు మరోసారి విచారణ జరిపింది.

ABOUT THE AUTHOR

...view details