ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'రాయలసీమ ఎత్తిపోతల సామర్థ్యం పెంచితే తెలంగాణకు తీవ్ర నష్టం'

By

Published : Aug 28, 2020, 5:31 PM IST

ఎన్జీటీ చెన్నై బెంచ్‌లో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై విచారణ జరిగింది. తెలంగాణ తరఫున అదనపు ఏజీ రామచంద్రరావు వాదనలు వినిపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు అవసరమని తెలంగాణ పేర్కొంది. ప్రాజెక్టులో భారీ మార్పులు చేసి ఇంతకుముందుదేనని ఏపీ తప్పుదోవ పట్టిస్తుందని తెలంగాణ ఆరోపించింది. వాదనలు విన్న ఎన్జీటీ చెన్నై బెంచ్‌... తదుపరి విచారణను సెప్టెంబర్ 3కి వాయిదా వేసింది.

hearings in chennai NGT Over AP and telangana water dispute
'రాయలసీమ ఎత్తిపోతల సామర్థ్యం పెంచితే తెలంగాణకు తీవ్ర నష్టం'

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీ చెన్నై బెంచ్‌లో విచారణ జరిగింది. పర్యావరణ అనుమతులు లేవని దాఖలైన పిటిషన్‌పై విచారణ నిర్వహించారు. తెలంగాణ తరఫున అదనపు ఏజీ రామచంద్రరావు వాదనలు వినిపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు అవసరమని తెలంగాణ పేర్కొంది. ప్రాజెక్టు సామర్థ్యం 40 వేల క్యూసెక్కుల నుంచి 80 వేలకు రెట్టింపు చేశారని తెలంగాణ వివరించింది. పర్యావరణ అనుమతుల్లేవని కమిటీ ఇచ్చిన నివేదికను పక్కన పెట్టాలని తెలంగాణ కోరింది.

నిపుణుల కమిటీ ఏపీ చెప్పిన వాటినే విని ఏకపక్షంగా నివేదిక ఇచ్చిందని తెలంగాణ వాదనలు వినిపించింది. అవసరమైతే కమిటీ సభ్యులను హెలికాఫ్టర్‌లో తీసుకెళ్లి ప్రాజెక్టు చూపెడతామని తెలిపింది. ప్రాజెక్టులో భారీ మార్పులు చేసి ఇంతకుముందుదేనని ఏపీ తప్పుదోవ పట్టిస్తోందని తెలంగాణ ఆరోపించింది. తెలంగాణకు ఇది జీవన్మరణ సమస్య అని ఆ రాష్ట్ర అదనపు ఏజీ 2 గంటలపాటు వాదించారు. రాయలసీమ ఎత్తిపోతల సామర్థ్యం పెంచితే తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. వాదనలు విన్న ఎన్జీటీ చెన్నై బెంచ్‌... తదుపరి విచారణను సెప్టెంబర్ 3కి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details