రాజధానికి సంబంధించిన అంశాల గురించి దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో నేటి నుంచి తుది విచారణ ప్రారంభం కానుంది. త్రిసభ్య ధర్మాసనం వ్యాజ్యాలన్నింటిపై రోజువారీ విచారణ చేపట్టనుంది. అంశాల వారీగా పిటిషన్లను విభజించి విచారిస్తామని గత విచారణలో ధర్మాసనం తెలిపింది. ఈరోజు ప్రధాన వ్యాజ్యాలతో పాటు కొన్ని అనుబంధ పిటిషన్లపైనా విచారణ జరపనుంది. విచారణను హైబ్రిడ్ పద్ధతిలో కొనసాగించనున్నారు. రెండు వారాలపాటు రోజువారీ విచారణ జరిపే అవకాశముంటుంది. అనుబంధ పిటిషన్లలో అత్యధిక శాతం ఇప్పటికే విచారణ పూర్తిచేశారు. విశాఖలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి సంబంధించి ప్రణాళిక ప్రకారం ప్రభుత్వానికి అనుమతి ఇవ్వాలని గత విచారణలో కోరారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.
రాజధాని వ్యాజ్యాలపై నేటి నుంచి తుది విచారణ - AP High Court Latest news
రాజధాని గురించి దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో నేటి నుంచి తుది విచారణ ప్రారంభం కానుంది. ప్రధాన వ్యాజ్యాలతో పాటు కొన్ని అనుబంధ పిటిషన్లపైనా విచారణ జరపనుంది.
రాజధాని అంశం.. నేటి నుంచి తుది విచారణ