ఆనందయ్య(ANANDAYYA) కంటిచుక్కల మందు వినియోగానికి త్వరలోనే సానుకూల సంకేతాలు ఉంటాయని భావిస్తున్నట్లు ఆయన తరఫు న్యాయవాది.. హైకోర్టుకు తెలిపారు. దీనికి సంబంధించి కేంద్ర ఆయుష్ శాఖ ఆనందయ్యతో సంప్రదింపులు జరుపుతోందని నివేదించారు. చుక్కల మందు విషయంలో వివిధ ల్యాబ్ లు ఇచ్చిన నివేదికలను పరిశీలించి కౌంటర్ వేసేందుకు సమయం కావాలన్నారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం.. విచారణను రెండు వారాలపాటు వాయిదా వేసింది. వ్యాజ్యాల విచారణ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే. గోస్వామి.. సంప్రదాయ మందులను తక్కువ చేసి చూడకూడదన్నారు. తలనొప్పితో 3 రోజులు బాధపడుతున్న సమయంలో ఓ వ్యక్తి సూచించిన సంప్రదాయమందుతో 15 నిమిషాల్లో తగ్గిందని తన స్వీయ అనుభవాన్ని తెలిపారు.
ANANDAYYA: 'సంప్రదాయ మందులను తక్కువ చేసి చూడకూడదు' - corona news
ఆనందయ్య(ANANDAYYA) కంటిచుక్కల మందుపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. దీనిపై త్వరలోనే సానుకూల స్పందన వస్తుందని భావిస్తున్నట్లు ఆనందయ్య తరఫున్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ తరుణంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన స్వీయ అనుభవంతో కీలక వ్యాఖ్య చేశారు.
సంప్రదాయ మందులను తక్కువ చేసి చూడకూడదు