ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Jagan Case: 'జగన్ బెయిల్​ రద్దు పిటిషన్'​పై విచారణ.. మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా - రఘురామ

సీఎం జగన్‌ బెయిల్‌ రద్దుచేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.

Jagan's bail petition
జగన్ బెయిల్ పిటిషన్

By

Published : Jul 1, 2021, 11:48 AM IST

సీఎం జగన్‌ బెయిల్‌ రద్దుచేయాలంటూ.. ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. రఘురామ రీజాయిండర్‌పై రిప్లయ్‌ దాఖలు చేస్తామని జగన్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రీజాయిండర్‌పై లిఖితపూర్వక వివరణ అవసరం లేదని కోర్టు పేర్కొంది.

రీజాయిండర్‌లో కొత్త విషయాలు వెనక్కి తీసుకుంటే రిప్లయ్‌ అవసరం లేదని జగన్‌ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం మధ్యాహ్నం 2 గంటలకు వాదనలు వినిపించాలంటూ.. విచారణ వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details