ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

JAGAN-ED CASE: విజయసాయిరెడ్డి మెమోపై కోర్టు అభ్యంతరం - india cements cases

విజయసాయిరెడ్డి మెమోపై కోర్టు అభ్యంతరం
విజయసాయిరెడ్డి మెమోపై కోర్టు అభ్యంతరం

By

Published : Sep 9, 2021, 6:23 PM IST

Updated : Sep 9, 2021, 8:37 PM IST

18:20 September 09

అభియోగాల నమోదుపై వాదనల కోసం విచారణ ఈనెల 20కి వాయిదా

హైదరాబాద్​లోని సీబీఐ, ఈడీ కోర్టుల్లో సీఎం జగన్ అక్రమాస్తుల కేసు, ఇండియా సిమెంట్స్ కేసు, ఓబుళాపురం మైనింగ్ కేసుల్లో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపింది. విజయసాయిరెడ్డి మెమోపై ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. విశ్రాంత ఐఏఎస్ శామ్యూల్ డిశ్చార్జ్ పిటిషన్‌పై సీబీఐ కౌంటరు దాఖలు చేస్తూ శామ్యూల్‌ను ఛార్జ్‌షీట్ నుంచి తొలగించవద్దని సీబీఐ కోరింది.  

హైదరాబాద్‌లోని సీబీఐ, ఈడీ కోర్టులో ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. మొదట ఈడీ కేసులు విచారణ జరపాలని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని విజయసాయిరెడ్డి అన్నారు. విజయసాయిరెడ్డి మెమోపై ఈడీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. మూడు వాయిదాలుగా ఇదే చెప్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. అభియోగాల నమోదుపై వాదనలకు సిద్ధంగా ఉన్న ఈడీ వాదనల కోసం విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.  

ఇండియా సిమెంట్స్ కేసులోనూ...

  ఇండియా సిమెంట్స్ కేసులో జగన్, విజయసాయి డిశ్చార్జ్ పిటిషన్లపై కూడా విచారణ జరిగింది. జగన్, విజయసాయి పిటిషన్లపై కౌంటర్‌ దాఖలుకు గడువు కోరిన సీబీఐ... విశ్రాంత ఐఏఎస్ శామ్యూల్ డిశ్చార్జ్ పిటిషన్‌పై సీబీఐ కౌంటరు దాఖలు చేస్తూ శామ్యూల్‌ను ఛార్జ్‌షీట్ నుంచి తొలగించవద్దని కోరింది. తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది.  

ఓబుళాపురం గనుల కేసుపై...  

ఓబుళాపురం గనుల కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ జరిపింది. వాదించకపోతే తగిన ఉత్తర్వులు ఇస్తామని శ్రీలక్ష్మికి కోర్టు స్పష్టం చేసింది. అభియోగాల నమోదుపై లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తామన్న సీబీఐ... ఓఎంసీ కేసు విచారణను ఈనెల 13కు వాయిదా వేసింది.  

ఇదీచదవండి.

Lokesh: రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు: లోకేశ్‌

Last Updated : Sep 9, 2021, 8:37 PM IST

ABOUT THE AUTHOR

...view details