ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు' పిటిషన్​పై సీబీఐ కోర్టులో నేడు మరోసారి విచారణ - జగన్ అక్రమాస్తుల కేసు

జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టులో నేడు మరోసారి విచారణ జరగనుంది. కోర్టు షరతులు ఉల్లంఘించినందున విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ.. ఎంపీ రఘురామకృష్ణరాజు ఇటీవల పిటిషన్ వేశారు.

నేడు మరోసారి విచారణ
నేడు మరోసారి విచారణ

By

Published : Aug 16, 2021, 5:27 AM IST

జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టులో నేడు మరోసారి విచారణ జరగనుంది. కోర్టు షరతులు ఉల్లంఘించినందున విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ.. ఎంపీ రఘురామకృష్ణరాజు ఇటీవల పిటిషన్ వేశారు. జగన్, ఇతర నిందితులతో కలిసి విజయసాయిరెడ్డి ప్రత్యక్షంగా, పరోక్షంగా సాక్షులను బెదిరిస్తున్నారని రఘురామ పేర్కొన్నారు. పిటిషన్‌పై ఈ నెల 13న సీబీఐ మెమో దాఖలు చేసింది. విచక్షణ మేరకు, చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరింది. ఇవాళ కౌంటర్ దాఖలు చేయాలని విజయసాయిరెడ్డికి న్యాయస్థానం ఇప్పటికే స్పష్టంచేసింది.

ABOUT THE AUTHOR

...view details