ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలంగాణ: హైకోర్టు లాయర్ దంపతుల హత్య కేసు విచారణ

By

Published : Feb 22, 2021, 5:35 PM IST

తెలంగాణా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వామన్​రావు దంపతుల హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. కుంట శ్రీనుతో పాటు మరో ఇద్దరి కస్టడీని కోరుతూ రామగిరి పోలీసులు పిటిషన్ వేశారు.

vaman rao murder
హైకోర్టు లాయర్ దంపతుల హత్య కేసు విచారణ

తెలంగాణావ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. నిందితుల కస్టడీ కోరుతూ మంథని కోర్టులో పోలీసులు వేసిన పిటిషన్​పై విచారణ జరుగుతోంది. కుంట శ్రీనుతో పాటు మరో ఇద్దరి కస్టడీని కోరుతూ రామగిరి పోలీసులు పిటిషన్ వేశారు.

ఈనెల 19న ముగ్గురు నిందితులను ఘటనాస్థలికి తీసుకువెళ్లి హత్య సీన్​ రీకన్​స్ట్రక్షన్ చేశారు. ప్రస్తుతం వారు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. నిందితులకు వాహనం, ఆయుధాలు సమకూర్చిన బిట్టు శ్రీనును పోలీసులు విచారిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details