కేసు నమోదు చేసిన వెంటనే.. రఘురామను అరెస్టు చేయొద్దు: హైకోర్టు - ఎంపీ రఘురామ లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ
16:57 July 01
ఎంపీ రఘురామ లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ
High Court on MP RRR Petition: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. కేసుల నమోదులో పోలీసులు చట్టబద్ధ ప్రక్రియ అనుసరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈనెల 4న ప్రధాని మోదీ భీమవరం పర్యటనలో పాల్గొనేందుకు తనకు రక్షణ కల్పించాలని ఎంపీ రఘురామ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎంపీగా ఉన్న మీరు నియోజకవర్గానికి వెళ్లొచ్చు కదా అని ధర్మాసనం వ్యాఖ్యానించగా.. పోలీసులు ఏదో ఒక కేసు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని రఘురామ తరఫున న్యాయవాది ఉమేశ్‌చంద్ర కోర్టుకు తెలిపారు. ఈనెల 3, 4 తేదీల్లో కేసు పెడితే పోలీసులు చట్టబద్ధ ప్రక్రియ అనుసరించాలన్న హైకోర్టు.. కేసు నమోదు చేసిన వెంటనే అరెస్టు చేసేందుకు వీల్లేదని తేల్చి చెప్పింది.
ఇదీ చదవండి: