ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఏపీ రిలీవ్ చేసినా తెలంగాణ చేర్చుకోలేదు' - supreme court latest news

తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజనపై అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఏపీ సంస్థలు రిలీవ్ చేసినా తెలంగాణ సంస్థలు చేర్చుకోలేదని ఉద్యోగుల పిటిషన్ వేశారు. న్యాయవాదుల అభ్యర్ధన మేరకు కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది.

Hearing in Supreme court over Electricity employees petition
'ఏపీ రిలీవ్ చేసినా తెలంగాణ చేర్చుకోలేదు'

By

Published : Oct 9, 2020, 5:21 PM IST

తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ధర్మాధికారి కమిటీ తుది నివేదికపై తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో పిటిషన్ వేసింది. ఏపీ సంస్థలు రిలీవ్ చేసినా తెలంగాణ సంస్థలు చేర్చుకోలేదని ఉద్యోగుల పిటిషన్ వేశారు. ఉద్యోగులకు 4 నెలలుగా జీతాలు లేవని న్యాయవాది నరసింహ వాదించారు. న్యాయవాదుల అభ్యర్ధన మేరకు కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది. సోమవారం సమగ్ర విచారణ చేపడతామని జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details