ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

High Court: పాఠశాలలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు:హైకోర్టు - అమరావతి తాజా వార్తలు

High Court: విద్యాసంస్థల్లో 25 శాతం సీట్ల కేటాయింపు ఉత్తర్వుల పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. పాఠశాలలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

High Court
హైకోర్టు

By

Published : Sep 29, 2022, 1:58 PM IST

High Court: విద్యాసంస్థల్లో 25 శాతం సీట్ల కేటాయింపు ఉత్తర్వులపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఉత్తర్వులకు వ్యతిరేకంగా యూపీఈఐఎఫ్‌(యూనైటెడ్​ ప్రైవేట్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ ఫెడరేషన్​)... హైకోర్టును ఆశ్రయించింది. పిటిషనర్ తరఫున మతకుమిల్లి శ్రీవిజయ్ వాదనలు వినిపించారు. కేంద్రం ఇచ్చిన స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌కు వ్యతిరేకంగా ఉన్నాయని వాదించారు. పాఠశాల గుర్తింపును రద్దు చేస్తామని బెదిరిస్తున్నారని పిటిషినర్​ పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం... పాఠశాలలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తదపరి విచారణను మూడు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details