పోలవరం టెండర్ల రద్దుపై.. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఏం చెబుతుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. నవయుగ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం... తీర్పును రిజర్వులో పెట్టింది. తాము ఎక్కడా.. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడలేదని నవయుగ కంపెనీ తరఫు న్యాయవాది న్యాయమూర్తికి తెలిపారు. కాంట్రాక్టును ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. హైడల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి స్థలం చూపించే బాధ్యత జెన్‌కో సంస్థదే అని స్పష్టం చేశారు. ఒప్పందం ప్రకారం తమకు ఇంకా గడవు ఉందని నవయుగ కంపెనీ తెలిపింది. మరోవైపు.. పనుల్లో పురోగతి లేనందునే టెండర్లు రద్దు చేశామని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పారు. ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. చివరికి తీర్పును రిజర్వు చేసింది.
పోలవరం కాంట్రాక్టుపై ఏం జరగనుంది..?
పోలవరం టెండర్ల రద్దుపై హైకోర్టులో నవయుగ సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు ముగిశాయి. తమ కాంట్రాక్టును ఏకపక్షంగా రద్దు చేశారని సంస్థ తరఫున న్యాయవాది కోర్టుకు విన్నవించారు. నిర్మాణ పనులు తమకే అప్పగించాలని కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మానసం తీర్పును రిజర్వు చేసింది.
polavaram