ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఆందోళన... కరోనా కన్నా ప్రమాదకరం'

ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకుండా... కరోనా వైరస్ గురించి ఆందోళన చెందితే ఉపయోగం లేదని ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు బరుపాటి గోపి అన్నారు. మనం తీసుకునే ముందస్తు జాగ్రత్తలే మనకు శ్రీరామరక్ష అన్నారు. ముందుగా వైరస్ గురించిన అపోహలు తగ్గించుకుని వాస్తవాలు తెలుసుకుని జాగ్రత్తలు పాటిస్తే కరోనా దరిచేరదని పేర్కొన్నారు.

psychiatrist-gopi
psychiatrist-gopi

By

Published : Apr 5, 2020, 4:20 PM IST

మానసిక వైద్య నిపుణుడు బరుపాటి గోపితో ముఖాముఖి

మానసికంగా ధైర్యం లేకుంటే.. బలవంతుడు కూడా బలహీనుడు అవుతాడన్నది అందరూ గుర్తుంచుకోవాలని తెలంగాణకు చెందిన ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు బరుపాటి గోపి అన్నారు. ఇంట్లో ఉండడం ఇబ్బందిగా.. నిర్బంధంగా భావించకూడదని కుటుంబ సభ్యులతో గడిపేందుకు చక్కని అవకాశంగా భావించాలని వివరించారు. అలా గడపడం వల్ల మానసిక సమస్యలు చాలావరకు తగ్గుతాయన్నారు. భయపడినా ఆందోళన చెందినా రోగ నిరోధక శక్తి తగ్గుతుందని పేర్కొన్నారు. వైరస్ సోకిందనుకుంటే నేరుగా ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలన్నారు.

ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటూ మానసిక సమస్యలు తగ్గించుకోవాలని గోపీ సూచించారు. ప్రాణం అన్నింటికన్నా ముఖ్యమన్నది గ్రహిస్తే.. మద్యం ఇతర అలవాట్లు కలిగిన వారు ఇక్కట్లు పడరని స్పష్టం చేశారు. వైరస్ బారిన పడకుండా ఇతరులకు అంటించకుండా ఉంటే ప్రస్తుత పరిస్ధితిల్లో సైనికుడిలా దేశానికి సేవ చేసినట్లేనని అన్నారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో 226కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ABOUT THE AUTHOR

...view details