ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"టైమ్​కు ఆస్పత్రిలో ఉండాలి.. సాకులు చెప్పారంటే అంతే.." - బయమెట్రిక్​ కచ్చితంగా అమలు చేయలాన్న కృష్ణబాబు

Krishna Babu: ఈ నెలాఖరుకు వైద్య ఆరోగ్య శాఖలో బయోమెట్రిక్ హాజరును వందశాతం అమలు చేసి తీరాల్సిందేనని వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కృష్ణబాబు స్పష్టంచేసారు. ప్రతి ఉద్యోగీ నిర్ణీత సమయానికి అసుపత్రిలో ఉండాల్సిందేనని తేల్చిచెప్పారు. కలెక్టర్లు తరచూ ప్రభుత్వాస్పత్రులను తనిఖీ చేయాలని సూచించారు. వైద్య సేవలపై మీడియాలో వచ్చే వ్యతిరేక వార్తలపై ఎప్పటికప్పుడు కలెక్టర్లు స్పందించాలన్నారు.

Krishna Babu
కృష్ణబాబు

By

Published : May 26, 2022, 6:47 PM IST

Krishna Babu: ఈ నెలాఖరుకు వైద్య ఆరోగ్య శాఖలో బయోమెట్రిక్ హాజరును వందశాతం అమలు చేయాల్సిందేనని కలెక్టర్లకు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు ఆదేశించారు. బయోమెట్రిక్ హాజరు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించిన కృష్ణబాబు... ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఉద్యోగీ నిర్ణీత సమయానికి అసుపత్రిలో ఉండాల్సిందేనని తెల్చి చెప్పారు. ఏదో సాకు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు. ఉద్యోగులందరూ బయోమెట్రిక్ హాజరు కోసం రిజిస్టర్ అయిందా లేదా అని ఏపీవీవీపీ, డీహెచ్, డీఎంఈలు ఎప్పటికప్పుడు నివేదికలివ్వాలని తెలిపారు. ఫీల్డ్ లెవల్ సిబ్బంది బయోమెట్రిక్ హాజరు విషయమై కూడా సంబంధిత హెచ్​వోడీలు ప్లాన్ చేసుకోవాలన్నారు.

కలెక్టర్లు తరచూ ప్రభుత్వాస్పత్రులను తనిఖీ చేయాలని సూచించారు. వైద్య సేవలపై మీడియాలో వచ్చే వ్యతిరేక వార్తలపై ఎప్పటికప్పుడు కలెక్టర్లు స్పందించాలని చెప్పారు. ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ నిధులన్నీ వేరే అవసరాలకు వాడొద్దని స్పష్టం చేశారు. ప్రైవేట్​వాహనాల మాఫియాను అడ్డుకోవాలని సూచించారు. రుయా ఘటన నేపథ్యంలో ఆర్డీవో, డీఎస్పీ లతో కూడిన కమిటీలు తగిన నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. అదనంగా కావాల్సిన మహాప్రస్థానం వాహనాలపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఎక్కడా మందుల కొరత రాకూడదని... ఈ మేరకు ముందుగా ఇండింట్​లు పెడితే నిధులు విడుదల చేస్తామని కృష్ణబాబు స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details