MT Krishna Babu Review Meet: 108 సర్వీస్ ప్రొవైడర్, టెక్నికల్ విభాగాల పని తీరుపై వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 108 సేవలపై సమీక్ష నిర్వహించిన ఆయన.. సేవలు అందించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని సర్వీస్ ప్రొవైడర్లను నిలదీశారు. టెండర్ అగ్రిమెంట్ ప్రకారం సర్వీస్ ఇవ్వాలని ఆదేశించారు. 748 వాహనాల్లో 164 వాహనాలకు ట్రాకింగ్ లేకపోతే.. ఎవరు బాధ్యత వహించాలనీ సర్వీస్ ప్రొవైడర్లను నిలదీశారు. 108 ఐటీ సేవలపైన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఐటీ సేవలు అందించే భాగస్వామిని మార్చుకోవాలని ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవోకు ఆదేశాలిచ్చారు. అవసరమైతే రీటెండర్కు వెళ్లాలని ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవోను ఆదేశించారు.
108 సేవలలో నిర్లక్ష్యం.. సర్వీస్ ప్రొవైడర్లపై కృష్ణబాబు ఆగ్రహం - సమీక్ష
MT Krishna Babu: 108 సేవలపై వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. సేవలు అందిచడంలో నిర్లక్ష్యం వహించడంపై సర్వీస్ ప్రొవైడర్లను నిలదీశారు. 108 ఐటీ సేవలపైన తీవ్ర ఆసంతృప్తిని వ్యక్తం చేశారు.
108 వాహనాల మరమ్మతులకు జరుగుతున్న ఆలస్యంపైనా అధికారులను నిలదీశారు. సరిపడ వాహనాలు లేకపోవడంవల్లే 108 సేవలు సరిగా అందడంలేదనీ వ్యాఖ్యానించారు. పని చేయని, పాత వాహనాల విషయంలో నోడల్ ఆఫీసర్లు పర్యవేక్షణ బాధ్యత వహించాలని సూచించారు. వినియోగంలో లేని 108 వాహనాల విషయంలో ఎందుకు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. ప్రతి జిల్లాలోనూ 108 అంబులెన్స్ వాహనాలు అదనంగా పెట్టుకోవాలని కృష్ణ బాబు ఆదేశించారు. 104 వాహనాల జీపీఎస్ పనీ తీరుపై కృష్ణ బాబు అధికారులను ఆరా తీశారు. ట్రాకింగ్ సరిగా లేకపోవడంపట్ల సాంకేతిక సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనాల జీపీఎస్, జియో ఫెన్సింగ్ విధానాన్ని మెరుగుపర్చుకోవాలనీ స్పష్టం చేశారు. 108 వాహనాలకు జీపీఎస్ లేకపోవడాన్ని జీపీఎస్ లేకపోతే ఏ వాహనం ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుందనీ ప్రశ్నించారు. రెండు వారాల్లో మెరుగుపర్చుకోకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవీ చదవండి: