ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేసులు పెరుగుతున్నాయ్.. డిశ్చార్జ్ డ్రైవ్ మొదలుపెట్టాం: సింఘాల్ - అనిల్ కుమార్ సింఘాల్ తాజా వార్తలు

రాష్ట్రానికి ఆక్సిజన్ సరఫరాను పెంచాలని కేంద్రాన్ని కోరినట్లు.. వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ సింఘాల్ తెలిపారు. ఇప్పటివరకు 8 నైట్రోజన్ ట్యాంకర్లను ఆక్సిజన్‌ ట్యాంకర్లుగా మార్చామని.. ఆక్సిజన్ కొరత లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

singhal
ఆక్సిజన్ సరఫరా పెంచాలని కేంద్రాన్ని కోరాం: సింఘాల్

By

Published : May 1, 2021, 7:02 PM IST

Updated : May 1, 2021, 8:57 PM IST

ఆక్సిజన్ సరఫరా పెంచాలని కేంద్రాన్ని కోరాం: సింఘాల్

కరోనా రోగులకు చికిత్స అందించేందుకు.. రాష్ట్రానికి ఆక్సిజన్ సరఫరా పెంచాలని కేంద్రాన్ని కోరినట్లు.. వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. కేంద్రం పంపించే ఆక్సిజన్‌ ట్యాంకర్లను విమానాల ద్వారా తెస్తున్నట్లు ఆయన వివరించారు.

ఇప్పటివరకు 8 నైట్రోజన్ ట్యాంకర్లను ఆక్సిజన్‌ ట్యాంకర్లుగా మార్చామని.. ప్రాణవాయువు కొరత లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కొవిడ్ రోగులకు టెలీ వైద్యం అందుతోందన్నారు. కరోనా హోం కిట్లు ఇచ్చి రోగుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్నట్లు వివరించారు. ప్రస్తుతం 88వేల మందికి పైగా హోం ఐసొలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు.

ఆసుపత్రుల్లో డిశ్చార్జ్ డ్రైవ్

కరోనా కేసులు పెరుగుతున్నందున ఆసుపత్రుల్లో డిశ్చార్జ్‌ డ్రైవ్‌ మొదలుపెట్టినట్లు ఆయన తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉన్న విజయవాడ, గుంటూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఇప్పటికే డిశ్చార్జ్‌ డ్రైవ్ మొదలుపెట్టామన్నారు. పడకలు ఖాళీ అయ్యే కొద్దీ రోగులు చేరేందుకు అవకాశం ఉంటుందన్న సింఘాల్‌....ముందుగా కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో చేరాలని సూచించారు.

ఇదీ చదవండి:

'కరోనా నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం మరింత అవసరం'

Last Updated : May 1, 2021, 8:57 PM IST

ABOUT THE AUTHOR

...view details