విజయ్‌హజారే ట్రోఫీకి ఆటగాళ్ల ఎంపికపై నెలకొన్న వివాదాన్ని రేపటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చిస్తామని హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ తెలిపారు. మంకాడ్ ట్రోఫీకి సంబంధించిన సన్నాహల్లో భాగంగా అజారుద్దీన్ జింఖానా మైదానంలో ఆటగాళ్ల ప్రాక్టీస్ పరిశీలించారు. అనంతరం క్రీడాకారులతో ముచ్చటించిన ఆయన... వారికి సలహాలు, సూచనలు అందించారు.
విజయ్ హజారే ట్రోఫీ ఆటగాళ్ల వివాదంపై చర్చిస్తాం..: అజారుద్దీన్ - telangana varthalu
విజయ్ హజారే ట్రోఫీకి ఆటగాళ్ల ఎంపిక వివాదంపై మంగళవారం జరిగే అపెక్స్ కౌన్సిల్ భేటీలో చర్చిస్తామని అజారుద్దీన్ పేర్కొన్నారు. వివాదాన్ని త్వరలోనే పరిష్కరించుకుంటామన్నారు. మంకాడ్ ట్రోఫీకి సెలక్టర్ల మార్పు నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.
విజయ్ హజారే ట్రోఫీ ఆటగాళ్ల వివాదంపై చర్చిస్తామన్న అజారుద్దీన్
విజయ్ హజారే ట్రోఫీకి హైదరాబాద్ జట్టు ఎంపిక విషయంలో జరిగిన వివాదం గురించి త్వరలోనే సమీక్షించుకుంటామన్నారు. రాబోయే మంకాడ్ ట్రోఫీకి సెలెక్టర్లను మార్చాలా వద్దా అనే విషయంపై వివిధ అంశాలపై రేపు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. విజయ్ హజారే ట్రోఫీకి సీనియర్లతో కూడిన జట్టును సెలెక్టర్లు ప్రకటించడం వల్లే వివాదం చోటు చేసుకుందని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: స్నేహిత్ సంచలనం.. సీనియర్ టీటీలో పతకం ఖాయం