HC on Brahmin Corporation: బ్రాహ్మణ కో ఆపరేటివ్ సొసైటీ ఎన్నికలపై హైకోర్టు స్టే ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా సొసైటీ ఎన్నికలు జరుపుతున్నారని సిరివరపు శ్రీధర్ శర్మ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఎన్నికల ముందురోజు నోటిఫికేషన్ ఇచ్చారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కొందరు తమ అనుచరులను సభ్యులుగా ఎన్నుకున్నారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలు ఎలా జరుపుతారని ప్రశ్నించిన ధర్మాసనం.. కౌంటర్ వేయాలని కో ఆపరేటివ్ సొసైటీ, కలెక్టర్ కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.
బ్రాహ్మణ కో ఆపరేటివ్ సొసైటీ ఎన్నికలపై హైకోర్టు స్టే - HC stay on Brahmin Corporation
HC on Brahmin Corporation: బ్రాహ్మణ కో ఆపరేటివ్ సొసైటీ ఎన్నికలపై హైకోర్టు స్టే ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా సొసైటీ ఎన్నికలు జరుపుతున్నారని సిరివరపు శ్రీధర్ శర్మ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు.
HC