గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శులను.. హోంశాఖలో మహిళా పోలీసులుగా పరిగణించడంపై... ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. ప్రభుత్వ చర్య.. దొడ్డిదారిన మహిళా పోలీసుల్ని నియమించుకోవడం లాంటిదేనంటూ.. వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఉద్యోగాల నియామక విషయంలో.. దొడ్డిదారి మార్గం సరికాదని తెలిపింది. ప్రత్యక్షంగా చేయలేనిదాన్ని పరోక్షంగా చేయడానికి ప్రభుత్వం పూనుకుందని.. ధర్మాసనం పేర్కొంది. పోలీసుల నియామకానికి నిబంధనలు ఉన్నాయని గుర్తుచేసింది. నియామక విధానాన్ని పక్కనపెట్టి.. సంరక్షణ కార్యదర్శులుగా నియమితులైనవారిని పోలీసులుగా ఎలా పరిగణిస్తారని ప్రశ్నించింది. వారిని మహిళా పోలీసులుగా పరిగణిస్తూ.. ప్రభుత్వం జీవో ఇవ్వడం సరికాదని ప్రాథమికంగా స్పష్టం చేసింది. జీవోల అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు.. ఇది అర్హమైన కేసు అని.. ధర్మాసనం పేర్కొంది. ఇప్పటికే ఈ వ్యాజ్యాల్లో కౌంటర్ వేశామని.. అది కోర్టు ముందున్న ఫైళ్లలో చేరలేదని... ప్రభుత్వ న్యాయవాది వాదించారు. విచారణను గురువారానికి వాయిదా వేయాలన్న అభ్యర్థనకు.. న్యాయస్థానం అంగీకరించింది.
రాష్ట్ర ప్రభుత్వంపై.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
మహిళా సంరక్షణ కార్యదర్శుల నియామకంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. వారి నియామకం దొడ్డిదారిన నియమించుకోవడం లాంటిదేనంటూ వ్యాఖ్యానించిన ధర్మాసనం.. పోలీసు నియామకానికి నిబంధనలు ఉన్నాయని గుర్తు చేసింది.
hc on women police recruitment