ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

70 ఏళ్ల నుంచే అదనపు పింఛను చెల్లించాలి: హైకోర్టు - ap hc news

పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు 70 ఏళ్లు పూర్తయ్యాక 10% అదనపు క్వాంటం (పరిమాణం) పింఛను చెల్లిస్తామన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు తప్పుపట్టింది. 70వ ఏడాదిలోకి అడుగిడిన వెంటనే 10 శాతం అదనపు పరిమాణ పింఛను చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పింది.

hc on old men pension
hc on old men pension

By

Published : Feb 27, 2022, 8:35 AM IST

పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు 70 ఏళ్లు పూర్తయ్యాక 10% అదనపు క్వాంటం (పరిమాణం) పింఛను చెల్లిస్తామన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు తప్పుపట్టింది. 70వ ఏడాదిలోకి అడుగిడిన వెంటనే 10 శాతం అదనపు పరిమాణ పింఛను చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పింది. 70ఏళ్లు నిండాకే అదనపు క్వాంటం పింఛను పొందేందుకు అర్హులని పదో పేరివిజన్‌ కమిషన్‌ సిఫారసుల్లో పేర్కొనలేదని స్పష్టం చేసింది. వృద్ధాప్యంలో ఉన్నవారికి పింఛను పెంపు కుటుంబ, వైద్య, ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు సాయపడుతుందని పేర్కొంది. ఆ సాయం అందకుండా చేయడం సరికాదని తెలిపింది. పదవీ విరమణ చేసిన ఓ ఉద్యోగి విషయంలో 70ఏళ్లు పూర్తి కాలేదనే కారణంతో 10శాతం పింఛను పెంపుదలకు నిరాకరిస్తూ విశాఖ సీతమ్మధార డివిజనల్‌ సబ్‌ట్రెజరీ కార్యాలయ సహాయ ట్రెజరీ అధికారి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. 70వ ఏట ప్రారంభంనుంచే పది శాతం అదనపు క్వాంటం పింఛను విడుదల చేయాలని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.జయసూర్య ఇటీవల ఈమేరకు తీర్పునిచ్చారు. 70 ఏళ్లు పూర్తయ్యాక (71వ సంవత్సరం నుంచి) పది శాతం పింఛను పెంచుతామని అధికారులు పేర్కొనడాన్ని సవాలు చేస్తూ విశాఖకు చెందిన విశ్రాంత తహసీల్దారు బి.అప్పారావు హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

ABOUT THE AUTHOR

...view details