కరోనా కష్టకాలంలో ప్రైవేటు ఆస్పత్రులు నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా వైద్య చికిత్సలు ప్రభుత్వాస్పత్రుల్లో సమగ్రంగా అందడం లేదని.. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే.. ప్రభుత్వ నిబంధనలను పక్కనపెట్టి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని గుంటూరుకు చెందిన పిటిషనర్ సురేశ్ బాబు తరపున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వ్యాజ్యం దాఖలు చేశారు.
ఏ ఆస్పత్రిలో ప్రభుత్వ ఉల్లంఘన జరిగిందో సమగ్ర వివరణ ఇవ్వండి: హైకోర్టు
కరోనా వైద్య చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రులు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని వేసిన పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఏ ఆస్పత్రుల్లో ఇలాంటి ఉల్లంఘన జరుగుతుందో సమగ్ర వివరాలతో అనుబంధ అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది.
hc on private
కేసు విచారణ జరిపిన హైకోర్టు.. ఏ ఆస్పత్రుల్లో ఇలాంటి ఉల్లంఘన జరుగుతుందో సమగ్ర వివరాలతో అనుబంధ అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్‌ను ఆదేశించింది. మరోవైపు ప్రభుత్వం తరపున కౌంటర్ దాఖలుకు వారం రోజులు సమయం ఇచ్చింది. విపత్తుల నిర్వహణ చట్టం కింద కరోనాతో మృతి చెందిన వారికి 7 నుంచి 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరినట్లు పిటిషనర్ తరపు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు తెలిపారు.
ఇదీ చదవండి:క్రిమిసంహారక టన్నెల్స్‌పై కేంద్రం నిషేధం!