ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎమ్మెల్యే కాటసానిపై పత్రిక ప్రకటన ఉత్తర్వులు వెనక్కి.. - ap hc news

పత్రికల్లో ప్రకటన ద్వారా పాణ్యం వైకాపా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి నోటీసు జారీ చేయాలంటూ ఈనెల 4 న ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు వెనక్కి తీసుకుంది. గతంలో ఆదేశించిన ప్రకారం తితిదే పాలక మండలి సభ్యులు అల్లూరి మల్లేశ్వరీ , ఎం.ఎన్ శశిధర్లకు పత్రికల్లో ప్రకటన ద్వారా నోటీసులు జారీ చేయాలని పిటిషనర్ కు స్పష్టం చేసింది .

hc on panyam mla
hc on panyam mla

By

Published : Jan 21, 2022, 6:18 AM IST

పత్రికల్లో ప్రకటన ద్వారా పాణ్యం వైకాపా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి నోటీసు జారీ చేయాలంటూ ఈనెల 4 న ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు వెనక్కి తీసుకుంది. గతంలో ఆదేశించిన ప్రకారం తితిదే పాలక మండలి సభ్యులు అల్లూరి మల్లేశ్వరీ , ఎం.ఎన్ శశిధర్లకు పత్రికల్లో ప్రకటన ద్వారా నోటీసులు జారీ చేయాలని పిటిషనర్ కు స్పష్టం చేసింది . విచారణను ఫిబ్రవరి 7 కు వాయిదా వేసింది . ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్ర , జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది . తితిదే బోర్డు పాలక మండలి 18 మంది సభ్యుల నియామకాన్ని సవాలు చేస్తూ భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి జి.భానుప్రకాశ్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంలో కోర్టు నోటీసులను తిరస్కరించిన ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి మరో ఇద్దరికి పత్రికల్లో ప్రకటన ద్వారా నోటీసులు జారీచేయాలని ఈనెల 4 న హైకోర్టు ఆదేశించింది. రాంభూపాల్ రెడ్డి తాజాగా అనుబంధ పిటిషన్ వేస్తూ .. తన వ్యవహారంలో ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కోరారు . తాజాగా అనుబంధ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం .. సానుకూలంగా స్పందించింది . ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది.

ABOUT THE AUTHOR

...view details