ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గ్రూప్-1 అప్పీళ్లపై హైకోర్టులో విచారణ

గ్రూప్-1 కు సంబంధించి హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ.. ధర్మాసనం ఎదుట ఏపీపీఎస్సీ అప్పీల్ దాఖలు చేసింది. మౌఖిక పరీక్షకు ఎంపికైన కొందరు అభ్యర్థులు కూడా అప్పీళ్లు వేయగా.. హైకోర్టులో విచారణ జరిగింది.

hc on group 1 exams
hc on group 1 exams

By

Published : Jul 16, 2021, 7:12 AM IST

గ్రూప్ -1 ఇంటర్వ్యూతో పాటు తదుపరి చర్యలన్నింటిని నిలువరిస్తూ..ఈ ఏడాది జూన్ 16 న హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ.. ధర్మాసనం ఎదుట ఏపీపీఎస్సీ అప్పీల్ దాఖలు చేసింది . మౌఖిక పరీక్షకు ఎంపికైన కొందరు అభ్యర్థులు కూడా అప్పీళ్లు వేశారు . తాజాగా జరిగిన విచారణలో ఏపీపీఎస్సీ తరపు న్యాయవాది మల్లిఖార్జునరావు వాదనలు వినిపించారు . సింగిల్ జడ్జి ఉత్తర్వులు 365 మంది అభ్యర్థులపై ప్రభావం చూపుతుందన్నారు . ఎంపిక ప్రక్రియ కొనసాగించేందుకు అనుమతించాలని , ఫలితాల ప్రకటనను నిలువరించేలా ఆదేశాలు జారీచేయాలని కోరారు . మౌఖిక పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల తరఫు న్యాయవాదులు బి.రచన , కె.లక్ష్మీనరసింహా విచారణకు హాజరయ్యారు . మరికొన్ని అప్పీళ్లు విచారణకు రానున్నాయన్నారు . ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. విచారణను ఈ నెల 22 కు వాయిదా వేసింది . హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి , జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

ABOUT THE AUTHOR

...view details