ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జీవో 100పై హైకోర్టులో పిల్ - ap news

ఏపీ ఈగెజిట్​లో అత్యల్ప సంఖ్యలో జీవోలను ఉంచే విధంగా ప్రభుత్వం తెచ్చిన జీవో 100పై హైకోర్టులో పిల్ దాఖలైంది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.

జీవో 100పై హైకోర్టులో పిల్
జీవో 100పై హైకోర్టులో పిల్

By

Published : Oct 7, 2021, 6:54 AM IST

అత్యల్ప సంఖ్యలో ప్రభుత్వ ఉత్తర్వులను ఏపీఈగెజిట్ వెబ్​సైట్​లో ఉంచేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 7న జారీచేసిన జీవో 100ను సవాల్​ చేస్తూ తెలుగువన్.కామ్ ' డిజిటల్ మీడియా మేనేజింగ్ డైరెక్టర్ కంఠంనేని రవిశంకర్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది . పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , ఐటీశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. ఇదే వ్యవహారంతో ముడిపడి ఉన్న వాజ్యాలతో కలిసి ప్రస్తుత పిల్​ను ఈనెల 27న విచారణ జరుపుతామని పేర్కొంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి , జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

ABOUT THE AUTHOR

...view details