AP govt on free seats: 2022-23 విద్యా సంవత్సరం నుంచి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు విద్యాహక్కు చట్టం నిబంధనల ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో మొదటి తరగతిలో 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి. రాజశేఖర్ ఈ మేరకు అఫిడవిట్ వేశారు . ఆర్టీఈ చట్టం సెక్షన్ 12 (1) (సి) ప్రకారం అర్హులైన పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు భర్తీ చేయాల్సి ఉందని న్యాయవాది తాండవ యోగేష్ హైకోర్టులో పిల్ వేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు.. గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఎత్తివేసి 25 శాతం సీట్ల భర్తీకి ఏమి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి హైకోర్టులో అఫిడవిట్ వేశారు.
HC On Education: 'వారికి 25శాతం సీట్లు ఉచితంగా కేటాయిస్తాం' - hc on right to education act
25% free seats: 2022-23 విద్యా సంవత్సరం నుంచి ఆర్థికంగా వెెనుకబడిన పిల్లలకు విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో మొదటి తరగతిలో 25శాతం సీట్లు ఉచితంగా కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్ అఫిడవిట్ దాఖలు చేశారు.
hc on education