HIGH COURT ON CINEMA TICKETS: సినిమా టికెట్ ధరల నిర్ణయ విషయంలో ఏర్పాటు చేసిన కమిటీ.. భాగస్వాములైన వారితో చర్చలు జరుపుతోందని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ తెలిపారు. ఇప్పటికే రెండు సార్లు చర్చలు జరిగాయని.. మరోసారి చర్చలు జరుగనున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విచారణను వాయిదా వేయాలని కోరారు. ఆ అభ్యర్ధనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర , జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తితో ధర్మ విచారణను మార్చి 10కి వాయిదా వేసింది.
Hc on cinema tickets: సినిమా టికెట్ల పిటిషన్లపై విచారణ వాయిదా
HIGH COURT ON CINEMA TICKETS: సినిమా టికెట్ల ధరపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ అభ్యర్ధనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. విచారణను మార్చి10కి వాయిదా వేసింది. టికెట్ ధరలపై కమిటీ చర్చలు జరుపుతోందని ఏజీ తెలిపారు.
సినిమా టికెట్ ధరలను తగ్గిస్తూ.. గతేడాదిలో రాష్ట్ర హోంశాఖ జారీచేసిన జీవో 35ను సవాలు చేస్తూ పలు సినిమా థియేటర్ యాజమాన్యాలు దాఖలు వ్యాజ్యాల్లో హైకోర్టు సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. జీవో 35కు పూర్వం అనుసరించిన విధానాన్ని ధరల ఖరారు విషయంలో పాటించాలని ఆదేశించారు. ఆ ఉత్తర్వులపై ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీల్ వేసింది. ఇటీవల అప్పీళ్లపై విచారణ చేసిన ధర్మాసనం.. ధరలు ఖరారు విషయంలో సినీపరిశ్రమ భాగస్వాములు, ప్రభుత్వ అధికారులతో కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించింది.
ఇదీ చదవండి: