కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో జరగనున్న బీఈడీ రెండో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసేలా ఆదేశాలు జారీచేయాలంటూ పిటిషనర్ చేసిన అభ్యర్ధనను హైకోర్టు తోసిపుచ్చింది. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ సరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని వర్సిటీ తరపు న్యాయవాది రాంబాబు చెప్పిన వాదనలను పరిగణనలోకి తీసుకుంది. ఈ దశలో న్యాయస్థాన జోక్యం చేసుకుంటే సవ్యంగా జరిగే ప్రక్రియపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలు పనిచేస్తున్నాయని తెలిపింది. విద్యార్థుల ప్రయోజనాలతోపాటు, ఇతర అంశాల్ని పరిగణనలోకి తీసుకొని పరీక్షల నిలుపుదలకు నిరాకరించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిన్ ఏవీ శేషసాయి ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.
AP-HIGH COURT : 'విద్యాసంస్థలు పని చేస్తున్నాయి.. పరీక్షలు వాయిదా వేయలేం' - hc latest news
కొవిడ్ దృష్ట్యా నాగార్జున విశ్వవిద్యాలయంలో జరగనున్న బీఈడీ పరీక్షలను వాయిదా వేయాలనే ఓ పిటిషనర్ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలు పనిచేస్తున్నాయని తెలిపింది. విద్యార్థుల ప్రయోజనాలతోపాటు, ఇతర అంశాల్నీ పరిగణనలోకి తీసుకొని పరీక్షల నిలుపుదలకు నిరాకరిస్తున్నట్లు పేర్కొంది.
కొవిడ్ వ్యాప్తి నేపథ్యలో ఏఎన్ యూ పరిధిలో ఈనెల 20 నుంచి నిర్వహించనున్న బీఈడీ రెండో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ 'ఓడీఈ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ఫౌండేషన్ ట్రస్ట్ హైకోర్టులో వ్యాజ్యం వేసింది. న్యాయవాది చక్రా శ్రీనివాసరావు వాదనలు వినిపిస్తూ.. కొవిడ్ కారణంగా రవాణా సౌకర్యాలు సరిగా లేవన్నారు. పరీక్షకు ఒడిశా నుంచి హాజరుకావాల్సిన విద్యార్థులున్నారన్నారు. దేశ వ్యాప్తంగా రోజుకు లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ ఇవన్నీ జీవితంలో భాగం అయ్యాయన్నారు. కరోనా ఎంతకాలం భరించగలమని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి :BANDI SRINIVASARAO : 'ఈనెల 21న సీఎస్‌కు సమ్మె నోటీసు ఇస్తాం'