ప్రభుత్వం విడుదల చేసిన వేతన సవరణ జీవో ఎంతగానో నిరాశపరిచిందని ఏపీ హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాలరావు అన్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. 23.29 శాతం ఫిట్మెంట్ మధ్యంతర భృతి కన్నా .. తక్కువగా ఉందన్నారు. ఈ విధంగా ఫిట్మెంట్ ను తగ్గించిన దాఖలాలు దేశంలోని ఏ రాష్ట్రంలో లేదన్నారు. దీంతో ఉద్యోగులందరూ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారన్నారు. రాష్ట్ర విభజన తర్వాత జీవితాలు ఎంతో ఉన్నతంగా ఉంటాయని ఆశతో ఇక్కడికి వచ్చామన్నారు. గత ప్రభుత్వం ఇంటి అద్దె అలవెన్స్ 30 శాతం, ఉచిత వసతి, ఐదు రోజుల పనిదినం, రవాణా సౌకర్యాలు కల్పించిందన్నారు. అంతేకాక సీఆర్డీఏ పరిధిలో నామమాత్రపు ధరతో ఫ్లాట్లు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసిందన్నారు. ప్రస్తుత అద్దె అలవెన్స్ స్లాబ్ ప్రకారం ఏపీలో ఏ నగరంలోనూ ఇల్లు అద్దెకు తీసుకునే పరిస్థితి లేదన్నారు.
సీఎం జగన్కు ఏపీ హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి లేఖ - hc employees latest news
సీఎం జగన్కు ఏపీ హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి లేఖ రాశారు. 23.29 శాతం ఫిట్మెంట్ మధ్యంతర భృతి కన్నా .. తక్కువగా ఉందన్నారు. ఈ విధంగా ఫిట్మెంట్ ను తగ్గించిన దాఖలాలు దేశంలోని ఏ రాష్ట్రంలో లేదన్నారు.
hc