తెలంగాణ నుంచి రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని హయత్ నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం మేరకు కొహెడలోని బాహ్యవలయ రహదారి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టగా.. కారు, ఆటోలో మద్యం తరలిస్తూ కొందరు పట్టుబడ్డారు. రమావత్ దామోదర్, హరి అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యం పట్టివేత - అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యం పట్టివేత
తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను హయత్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 600 మద్యం బాటిళ్లు, కారు, ఆటో స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యం పట్టివేత
నిందితుల నుంచి 600 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఏపీతో పోలిస్తే తెలంగాణలో మద్యం ధరలు తక్కువగా ఉండటం వల్ల తెలంగాణ నుంచి తీసుకెళ్లి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఇదీ చదవండి:సీఐ మృతి కేసులో మరో ట్విస్ట్: ప్రమాదమా..? హత్యా..?