బిర్యానీ తినడానికి ఓ హోటల్‌కి వెళ్లిన కుటుంబ సభ్యులకు చికెన్ ముక్కలతో పాటు జెర్రి వచ్చింది. ఈ ఘటన తెలంగాణలోని యాద్రాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ చోటు చేసుకుంది. రామన్నపేటకు చెందిన చంద్రశేఖర్ బిర్యానీ తినేందుకు కుటుంబసభ్యులతో కలిసి పట్టణ శివారులోని డాల్ఫిన్ హోటల్‌కి వెళ్లాడు. చికెన్ బిర్యానీ ఆర్డరిచ్చారు. బిర్యానీ తీసుకొచ్చి ప్లేట్లో వడ్డించి తినాలని చూసేసరికి జెర్రీ దర్శనమిచ్చింది. వెంటనే హోటల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లటంతో పాటు అధికారులకు ఫిర్యాదు చేశారు. హోటల్‌పై తగిన చర్యలు తీసుకుంటామని బాధితులకు అధికారులు హామీ ఇచ్చారు.
బిర్యానీలో చికెన్ ముక్కలతో పాటు దర్శనమిచ్చిన "జెర్రి" - డాల్పిన్ హోటల్ బిర్యానీలో జెర్రీ
కుటుంబసభ్యులంతా కలిసి బిర్యానీ తినేందుకు ఓ హోటల్‌కు వెళ్లారు. ఘుమఘుమలాడే చికెన్ బిర్యానీ తినేందుకు ఉవ్విళ్లూరుతున్న వారికి... ప్లేట్లో వడ్డించిన బిర్యానీ చూసేసరికి వికారం వచ్చింది. ఎందుకనుకుంటున్నారా!... ప్లేట్లో చికెన్ ముక్కలతో పాటు... జెర్రి కూడా దర్శనమిచ్చింది వాళ్లకు...!
బిర్యానీలో చికెన్ ముక్కలతో పాటు దర్శనమిచ్చిన "జెర్రీ"