గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు.. హాల్టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ సాయంత్రం 4 గంటల నుంచి ఆన్లైన్లో డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. వచ్చే నెల 1, 3, 4, 6, 7, 8 తేదీల్లో రాత పరీక్షలు జరగనున్నాయి. ఒక లక్షా 26 వేల 728 ఉద్యోగాలకు 21 లక్షల 69 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.
నేటి నుంచి సచివాలయ పరీక్షలకు హాల్టికెట్లు - hall_tickets_available_for_secretariat_exams
ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి సచివాలయ పరీక్షలకు హాల్టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. 4 గంటల తర్వాత నుంచి అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రకటించారు.
నేటి నుంచి సచివాలయ పరీక్షలకు హాల్టికెట్లు
TAGGED:
గోపాలకృష్ణ ద్వివేది